అఖిల్ - సురేందర్ రెడ్డి టైటిల్ పోస్టర్ రిలీజ్: ఊరమాస్ లుక్‌తో అక్కినేని హీరో.. రిలీజ్ డేట్ కూడా

2 days ago 5

For Quick Alerts

Subscribe Now  

For Quick Alerts

ALLOW NOTIFICATIONS  

bredcrumb

| Published: Thursday, April 8, 2021, 9:45 [IST]

హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్న ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా దక్కించుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. వీవీ వినాయక్ తెరకెక్కించిన 'అఖిల్'తో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాలు చేశాడు. ఇవేమీ ఈ అక్కినేని హీరోకు హిట్ రుచిని చూపించలేదు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడీ యంగ్ హీరో. ఈ క్రమంలోనే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమాను చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా ఆ మూవీ నుంచి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తోన్న సినిమాకు 'ఏజెంట్' అనే టైటిల్‌‌ను పెట్టారు. ఈరోజు ఈ అక్కినేని హీరో పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది. ఇందులో పొడవాటి జుట్టుతో ఉన్న అఖిల్.. సిగరెట్ కాల్చుతూ ఊరమాస్ లుక్‌తో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇది కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఇదే రోజు ఈ సినిమా నుంచి మరో పోస్టర్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Akhil Akkineni - Surender Reddy Movie First Look Poster Released

స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఏజెంట్'లో అఖిల్ SPF ఏజెంట్‌గా నటిస్తున్నాడు. అలాగే, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పై ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నారు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత వక్కంతం వంశీ రచయితగా మారి కథను అందిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. ఇక, ఈ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

English summary

Tollywood Young Hero Akhil Akkineni Signs New Project In geeta arts 2 banner. This Film Directed By very Known Bommarillu Bhaskar. In This Movie, Famous Director Samudrakhani Plays Father Role For Akhil Akkineni.

Story first published: Thursday, April 8, 2021, 9:45 [IST]

Malayalam Filmibeat

filmibeatlinenl

X

Receive FREE Movie News & Gupshup
In Your Inbox

Read Entire Article