అత్తింట్లో నరకం.. పెళ్లయిన 9 నెలలకే ఊహించని షాకిచ్చిన యువతి

2 days ago 3

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 08:54:00 AM

కట్నం కోసం భర్త నవీవ్, అత్త తిరుపతమ్మ తీవ్రంగా వేధింపులకు గురిచేస్తుండటంతో శైలజ మానసికంగా కుంగిపోయింది. తట్టుకోలేక మంగళవారం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని

శైలజ, నవీన్(ఫైల్ ఫోటోలు)

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ నగరంలో విషాదం
  • అత్తింటి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
  • పెళ్లయిన 9 నెలలకే దారుణం
అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువతి పెళ్లయిన 9 నెలలకే బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం నింపింది. జీడిమెట్లకు చెందిన శైలజ(23)కు ఎస్పీఆర్‌హిల్స్‌ సమీపంలోని సంజయ్‌నగర్‌కు చెందిన నవీన్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. డ్రైవర్‌గా పనిచేసే నవీన్‌కు వివాహ సమయంలో ఇస్తామన్న 2 తులాల బంగారం, రూ.10వేల నగదు కట్నం శైలజ తల్లిదండ్రులు బాకీ పడ్డారు.

దీంతో భర్త, అత్త తిరుపతమ్మ కలిసి శైలజను మానసికంగా, శారీరకంగా హింసించేవారు. నవీన్ అనేక తరుచూ కొడుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు నెలల క్రితం పెద్దల సమక్షంలో ఇద్దరికి నచ్చచెప్పి శైలజను అత్తారింటికి పంపించారు. మూడు వారాలుగా భర్త, అత్త వేధింపులు మళ్లీ ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శైలజ మంగళవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్త, భర్తతో పాటు మరిది ప్రవీణ్‌ పథకం ప్రకారమే తన కూతురిని హత్య చేశారని శైలజ తండ్రి యాదగిరి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శైలజ భర్త, అత్తను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : married woman commists suicide in hyderabad over dowry harassment
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article