అల్లు అర్జున్ ఇక నుంచి ఐకాన్ స్టార్.. సుకుమార్ ఎమోషనల్

2 days ago 6

Apr 8, 2021 08:04 AM

అల్లు అర్జున్ ఇక నుంచి ఐకాన్ స్టార్.. సుకుమార్ ఎమోషనల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 13న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో  "పుష్ప ఫస్ట్‌మీట్‌" పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా డైరెక్టర్‌ సుకుమార్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. "స్టైలీష్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ బన్నీకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో బన్నీ నటన అద్భుతం. ప్రమాణం చేసి చెబుతున్నా.. సినిమా చూసిన తర్వాత మీరే ఆ మాట అంటారు. సినిమా చూసిన తర్వాత మీరే ఆ మాట అంటారు. సినిమాలో అర్జున్‌.. నటన చూసిన తర్వాత స్టైలీస్‌ అనే పదం ఒక్కటే ఆయనకు సరిపోదనిపించింది. నా అభిప్రాయం ప్రకారం.. బన్నీ ఒక స్టైలీస్‌ స్టార్‌ కాదు.. ఐకాన్‌ స్టార్‌ తన కథల ఎంపిక ప్రత్యేకం.. వేసే డ్రెస్సులు ప్రత్యేకం.. బన్నీ డ్యాన్స్‌ ప్రత్యేకం.. అందుకే ఈ సినిమా తర్వాత బన్నీని ఐకాన్‌ స్టార్‌ లేదా పుష్ప అని పిలుస్తారు" అంటూ సుకుమార్‌ అన్నారు.  

Read Entire Article