అల్లు అర్జున్ ఇలా మారిపోయాడేంటి? ఆ ఒక్క మాటలోనే అన్నీ.. అనసూయ కామెంట్స్ వైరల్

2 days ago 3

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 04:29:00 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ట్వీట్ పెట్టిన అనసూయ.. స్వీట్ కామెంట్స్ చేసింది. అయితే ఈ కామెంట్స్‌ చూసి ఎప్పటిలాగే అనసూయపై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ ఇలా మారిపోయాడేంటి? అనసూయ కామెంట్స్

ప్రధానాంశాలు:

  • నేడు (ఏప్రిల్ 9) అల్లు అర్జున్ పుట్టినరోజు
  • స్పెషల్ విషెస్ పోస్ట్ చేసిన అనసూయ
  • అలా అనడంతో జబర్దస్త్ బ్యూటీపై ట్రోల్స్
బుల్లితెరపై రాణించడం, వీలుచిక్కితే చాలు వెండితెరపై మత్తెక్కించడం యాంకర్ అనసూయ స్టైల్. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉండటం అమ్మడి మరో కోణం. తన పోస్ట్‌లపై ట్రోలింగ్స్ జరిగినా, వ్యతిరేకత వచ్చినా ఏ మాత్రం జంకని ఈ హాట్ యాంకర్ తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కొన్ని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ చూసిన నెటిజన్స్ కొందరు ఆమెపైనే రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు.

మెగా హీరో రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ చేసి వెండితెరపై కూడా సత్తా చాటింది అనసూయ. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం ఇటు బుల్లితెర, అటు వెండితెర రెండూ బ్యాలెన్స్ చేస్తూ డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదంటూ రీసెంట్‌గా జరిగిన ఓ ఈవెంట్‌లో కన్ఫర్మ్ చేసింది అనసూయ. ఇదే వేదికగా తనకు అల్లు అర్జున్‌తో నటించాలని ఉందంటూ కోరిక బయటపెట్టింది.
RGV: రామ్ గోపాల్ వర్మపై నాగబాబు దిమ్మతిరిగే పోస్ట్.. కన్ఫ్యూజన్‌లో పడేస్తూ సెన్సేషనల్ కామెంట్స్
ఈ పరిస్థితుల్లో నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతూ ఒకే ఒక్క మాటతో బన్నీని ఆకాశానికెత్తింది అనసూయ. 'పుష్ప' సినిమాలోని అల్లు అర్జున్ లుక్ పోస్ట్ చేస్తూ.. ''సినిమా సినిమాకు, క్యారెక్టర్ క్యారెక్టర్‌కు ఈ వ్యక్తి ఎంతలా మారుతున్నాడో చూడండి!! రియల్ ఆర్టిస్ట్. పుష్పరాజ్ అదరగొట్టేశాడు. పాన్ ఇండియా మూవీ పుష్పతో మేమంతా గర్వించేలా చేయండి అల్లు అర్జున్ గారు. హ్యాపీ బర్త్ డే'' అని పేర్కొంది.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇది అనసూయ ట్వీట్ కదా! ట్రెండ్ కాకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఈ ట్వీట్ చూసి కొందరు నెటిజన్స్ థాంక్స్ అని చెబుతుండగా ఇంకొంతమంది నెటిజన్లు ఆమెపై అటాక్ స్టార్ట్ చేశారు. 'మంచి బిస్కెట్ వేశారులే' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా భజన బ్యాచ్ అనేస్తున్నారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : allu arjun birth day: anasuya bharadwaj sweet comments
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article