Venkatesh Kandepu | Samayam Telugu | Updated: 08 Apr 2021, 03:25:00 PM
Bodhan: కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 24 నుంచి ఆర్టీసీ పొరుగు రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపి వేసింది. ఇప్పుడు మళ్లీ అక్కడ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న వేళ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన మన ఆర్టీసీ అధికారులు వింత నిర్ణయం తీసుకున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
Hyd: బట్టల్లేకుండా రక్తపు మడుగులో భార్య.. తాళం వేసి వెళ్లిపోతున్న భర్త.. ఇంతలో..
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కోటగిరి, బోధన్, రెంజల్ మండలంలోని అనేక గ్రామాలు మహారాష్ట్ర ప్రాంత సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. బోధన్ మండలంలోని సాలూర గ్రామం నుంచి 80 కిలో మీటర్ల దూరంలో గల మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా కేంద్రం ఉంది. ఇదే జిల్లా పరిధిలోని బిలోలి, దెగ్లూర్, కొండల్వాడీ, ధర్మాబాద్ పట్టణ కేంద్రాలుగా ఉన్నాయి. నాందేడ్ సహా ఈ పట్టణ కేంద్రాలన్నింటికీ బోధన్ నుంచి బస్సులు నడుస్తున్నాయి. గతంలో నిత్యం 10 నుంచి 12 బస్సు సర్వీసులు నడిపే వారు. కరోనా కారణంగా వాటిని నిలిపి వేయగా, తాజాగా సోమవారం నుంచి ఐదు సర్వీసులను నడుపుతున్నారు. ప్రస్తుతానికి నాందేడ్, దెగ్లూర్ పట్టణాలకు బస్సులు నడుస్తున్నాయి. కార్లు, ప్యాసింజర్ ఆటోలైతే లెక్కలేకుండా తిరుగుతున్నాయి.
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాత సాలూర వద్ద ఉన్న ఉమ్మడి తనిఖీ ప్రాంగణం వద్ద పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న ప్రయాణికులకు టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి సరిహద్దులో గల సాలూర క్యాంప్ గ్రామంలో కూడా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకున్నారు.
30 ఏళ్ల క్రితం మహిళ మిస్సింగ్.. ఇప్పుడు 80 ఏళ్ల వయసులో ఇంటికి.. ఎన్నో ట్విస్ట్లు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : nizamabad tsrtc restarts bus services to maharashtra amid covid cases increasing
Telugu News from Samayam Telugu, TIL Network