| Published: Thursday, April 8, 2021, 8:42 [IST]
వకీల్ సాబ్ చిత్రంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన తన మనసులోని మాటలను పంచుకొన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌తో ఉన్న అనుబంధం, సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. తెలుగు ఫిల్మీబీట్‌తో దిల్ రాజు మాట్లాడుతూ..

ప్రతీ సినిమాకు రేంజ్ పెంచుకొంటూ
పవన్ కల్యాణ్‌ను కెరీర్ ఆరంభం నుంచి చూస్తూ వస్తున్నాను. పవర్ స్టార్‌కు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ లాంటి సినిమాలతో తన రేంజ్, స్టైల్‌ను పెంచుకొంటూ పోయారు. ఎవరూ ఊహించని విధంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకొన్నారు. ఇతరుల్లో లేని ఆయనకు ఉన్న స్టైల్‌ను బట్టి వకీల్ సాబ్ సినిమాను చేశాం అని దిల్ రాజు చెప్పారు.

సుదర్శన్ థియేటర్లో ఫ్యాన్‌గా
నిర్మాతగా మారిన తర్వాత ఫలానా హీరోతోనే సినిమా చేయాలనే పరిమితిని నేను విధించుకోలేదు. ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్, మహేష్‌తోపాటు దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేశాను. ఇక ముందు కూడా అలాగే సినిమా తీస్తాను. తొలి ప్రేమ సినిమా నా గుండెల్లో అలా నిలిచిపోయింది. వకీల్ సాబ్ ట్రైలర్‌ను సుదర్శన్ థియేటర్లో రిలీజ్ చేసిన సమయంలో ఓ ఫ్యాన్‌గా మారిపోయాను. ఆ మూమెంట్‌తో ఆ రోజు ఓ భావోద్వేగానికి గురయ్యాను అని దిల్ రాజు తెలిపారు.

మాస్క్ తీసుకు రాకపోతే
లాక్డౌన్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మాస్క్, శానిటైజర్ సిద్దం చేసుకొని సినిమా థియేటర్లకు రావాలని కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా మాస్క్ తీసుకురాకపోతే థియేటర్ వద్ద మాస్క్‌లు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమా చూడమనేది మా రిక్వెస్ట్ అని దిల్ రాజు పేర్కొన్నారు.

15 నెలలుగా స్టార్ హీరో సినిమా
టాలీవుడ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్ హీరో సినిమా రాక 15 నెలలైంది. కరోనా సమయంలో థియేటర్‌కు వెళితే ఏమవుతుందో అని చాలా మందికి భయాలున్నాయి. అయితే చాలా మంది సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ మూవీతో వినోదానికి దూరమవుతున్నామనే వారికి ఊరట లభిస్తుంది అని దిల్ రాజు అన్నారు.

ప్రేక్షకుడే జాగ్రత్తలు తీసుకోవాలి
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు సంబంధించి 50 శాతం అక్యుపెన్సీ ఇచ్చే అవకాశం పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొంటుందో వేచి చూడాలి. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏదైనా జరిగిందా. సేఫ్టీ ఏంటి అనేది కోర్టు అడిగింది. ప్రేక్షకుడే తనవంతుగా జాగ్రత్తలు చూసుకుంటూ ఎంజాయ్ చేయమని చెబుతున్నాం. అన్ని థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు మాస్క్‌లు పెట్టుకొనేలా, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని దిల్ రాజు చెప్పారు.
English summary
Dil Raju Interview about Vakeel Saab: Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. This movie trailer set a new record in Tollywood. Vakeel Saab trailer gaint 23.4 million views in 24 hours. In this occassion, Producer Dil Raju speaks to Fimibeat telugu exclusively.
Story first published: Thursday, April 8, 2021, 8:42 [IST]
X
Receive FREE Movie News & Gupshup
In Your Inbox