Thirumala Neppala | Samayam Telugu | Updated: 08 Apr 2021, 06:47:00 AM
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది. పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ప్రధానాంశాలు:
- ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
- రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తు
- ఎన్నికల్ని బహిష్కరించిన టీడీపీ
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది. పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుర్తించిన హింసాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ప్రతి సబ్ డివిజన్లో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అప్రమత్తంగా ఉంచారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలను బహిష్కరించినా.. ఎన్నికలు అధికార పక్షం ఊహించినంత ఏకపక్షంగా జరగడంలేదు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, గ్లోవ్స్‌లను పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్ధం చేశారు. ఎవరైనా కొవిడ్ పాజిటివ్ బాధితులు ఉంటే.. వారికి అవసరమైన పీపీఈ కిట్లు కూడా ఏర్పాటు చేశారు. వారు పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. సిబ్బంది అందరికీ కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన రక్షణ చర్యలు, మహిళా సిబ్బందికి తగిన వసతులను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే కాల్ సెంటర్‌కు టోల్‌ఫ్రీ నంబర్ 0866 2466877కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : andhra pradesh mptc zptc election polling 2021 live updates in telugu
Telugu News from Samayam Telugu, TIL Network