ఐపీఎల్ 2021 ముంగిట RCBకి ఉసేన్ బోల్ట్ మద్దతు

2 days ago 4

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 12:58:00 PM

జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ జెర్సీని ధరించి.. ఆ జట్టుకి తన మద్దతుని ప్రకటించాడు. ఈ ఏడాది టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లోనే బెంగళూరు టీమ్..?

Usain Bolt, RCB Team (Pic Source: Twitter)

ప్రధానాంశాలు:

  • ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు
  • ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయితో బెంగళూరు ఢీ
  • ఆర్సీబీకి సపోర్ట్‌‌ చేస్తున్న ఉసేన్ బోల్ట్
  • ఐపీఎల్‌లో టైటిల్ గెలవలేకపోతున్న బెంగళూరు టీమ్
ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్‌ తన మద్దతు ప్రకటించాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌తో చెపాక్ వేదికగా బెంగళూరు టీమ్‌ తలపడనుంది. ఇప్పటి వరకూ 13 ఐపీఎల్ సీజన్లు ముగియగా.. బెంగళూరు టీమ్ కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2020 సీజన్‌ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన బెంగళూరు టీమ్ ఏడింట్లో గెలుపొంది.. అతి కష్టంమీద ప్లేఆఫ్‌కి అర్హత సాధించింది. కానీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పేలవంగా ఓడిపోయిన బెంగళూరు టీమ్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆ జట్టు గత ఏడాది అంచనాల్ని అందుకోలేకపోయింది. దాంతో ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీషన్ (రూ.15 కోట్లు), పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.14.25 కోట్లు)ని కొనుగోలు చేసిన ఆర్సీబీ.. సరికొత్త కూర్పుతో బరిలోకి దిగబోతోంది.

ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఓపెనర్ దేవదత్ పడిక్కల్.. పూర్తిగా కోలుకుని మళ్లీ జట్టుతో చేరగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అలానే వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ కూడా ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో మెరుగ్గా రాణించి మంచి జోష్‌మీదున్నారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : jamaican sprinter usain bolt in rcb jersey cheers for the team ahead of ipl 2021
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article