కన్నకూతురిపై పైశాచికం.. గుట్టుగా అబార్షన్, చావును మించిన శిక్ష వేసిన కోర్టు

2 days ago 3

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 09:34:00 AM

కామంతో కళ్లు మూసుకుని కన్న కూతురిపైనే అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. అతడు చనిపోయేవరకు జైల్లోనే ఉంచాలని కోర్టు తీర్పు చెప్పింది.

Image

ప్రధానాంశాలు:

  • కన్నకూతురిపైనే అఘాయిత్యం
  • ట్యాబ్లెట్లు మింగించి అబార్షన్
  • జీవిత కాల శిక్ష విధించిన న్యాయస్థానం
మద్యం మత్తులో కళ్లు మూసుకుని కన్నబిడ్డపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడో కామాంధుడు. బాధితురాలు బంధువులకు ఈ విషయం చెప్పడంతో పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ కీచక తండ్రికి జీవితఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తుదితీర్పు వెలువరించింది. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం కొంపల్లి సమీపంలోని కాలనీకి చెందిన ఓ వ్యక్తి(40) భార్య చనిపోవడంతో కుమార్తె(17)తో కలసి ఉంటున్నాడు. తాగుడుకు బానిసై అతడు 2017లో కన్న కూతురిని బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక గర్భం దాల్చడంతో ఓ ప్రైవేట్‌ డాక్టర్ సూచనల మేరకు ట్యాబ్లెట్లు వేసి అబార్షన్ చేయించాడు. తండ్రి ఆగడాలు భరించలేకపోయిన బాధితురాలు దూరపు బంధువుకు తన బాధ చెప్పుకోవడంతో అతడి పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. నేర విచారణ చట్టం సెక్షన్‌ 164 ప్రకారం పోలీసులు బాలిక వాంగ్మూలాన్ని మేడ్చల్‌లోని 21 మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌తో నమోదు చేయించారు. ఈ కేసు విచారించిన సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి సురేష్‌ ఆ కామాంధుడిని మరణించేంత వరకు జైల్లోనే ఉంచాలని శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : man gets life sentence for molested own daughter in hyderabad
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article