కర్నూలు: రూ.20కే చీర, ఎగబడ్డ మహిళలు.. తీరా అక్కడికి వెళితే!

2 days ago 3

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 07:54:00 AM

.తక్కువ ధరకు చీర వస్తే ఎవరు కాదంటారు. ఇంకేముంది వందల సంఖ్యల మహిళలు షాపింగ్ మాల్ దగ్గరకు క్యూ కట్టారు. ఉదయాన్నే అక్కడ బారులు తీరారు. జనాలతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది.

నంద్యాల

ప్రధానాంశాలు:

  • నంద్యాలలో షాపింగ్ మాల్ బంపరాఫర్
  • రూ.20కే చీర అంటూ ప్రకటన
  • క్యూ కట్టిన మహిళలు, చివర్లో ట్విస్ట్
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ షాపింగ్ మాల్ బంపరాఫర్ ప్రకటించింది. రూ.20కే చీర అంటూ ప్రచారం చేసింది. అంత తక్కువ ధరకు చీర వస్తే ఎవరు కాదంటారు. ఇంకేముంది వందల సంఖ్యల మహిళలు షాపింగ్ మాల్ దగ్గరకు క్యూ కట్టారు. ఉదయాన్నే అక్కడ బారులు తీరారు. జనాలతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది. ఒక్కసారీగా అక్కడ పరిస్థితి మారిపోయింది.. అదుపు తప్పింది. షాపింగ్ మాల్ చుట్టు పక్కల ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది.. వాహనాల రాకపోకలకు సమస్యలు ఎదురయ్యాయి.

షాపింగ్ మాల్ దగ్గర పరిస్థితిపై సమాచారం రాగానే పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ పరిణామాలతో యాజమాన్యం ఆఫర్‌ లేదని ప్రకటించింది.. దీంతో మహిళలు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అసలే కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో ఇలా ఆఫర్లు ప్రకటించడంపై విమర్శలు మొదలయ్యాయి. అంతమంది జనాలు ఒక్కసారిగా అక్కడ క్యూ కడితే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : kurnool: shopping mall in nandyal announce saree for only rs 20
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article