కొత్త కాపురంలో చిచ్చురేపిన బర్త్‌డే కేక్.. వధువును హతమార్చి భర్త ఆత్మహత్య

2 days ago 8

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 01:27:00 PM

అనుమానం పేను భూతంగా మారి పెళ్లైన ఆరు వారాలకే భార్యను గొంతుకోసి చంపిన యువకుడు.. తర్వాత తానూ కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ప్రతీకాత్మక చిత్రం

ప్రధానాంశాలు:

  • బర్త్‌డే రోజున కేక్ తెచ్చిన ఇచ్చిన మేనత్త కొడుకు.
  • భార్యపై అపోహ పెంచుకున్న యువకుడు.
  • దారుణంగా భార్యను హత్యచేసిన భర్త.
వివాహమైన ఆరు వారాలకే అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన ఓ యువకుడు.. అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాల్లో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లా వీరాణం గోరత్తుపట్టికి చెందిన తంగరాజ్‌ (33) అనే యువకుడికి ఇటీవలే వివాహం జరిగింది. కనంగురిచ్చికి చెందిన మోనీష(19) అనే అమ్మాయిని తంగరాజ్ వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదర్చిన సంబంధమే కావడంతో ఫిబ్రవరి చివరి వారంలో వివాహం జరిపించారు.

బుధవారం ఉదయం చాలాసేపటి వరకు ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానించిన చుట్టుపక్కల వారు బలవంతంగా తలుపులు తెరవగా అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నారు. మోనిష రక్తపుమడుగులో పడి ఉండగా, ఆమె పక్కనే తంగరాజ్‌ ఉరేసుకొని పడి ఉన్నాడు. మోనిష గొంతుకోసిన తంగరాజ్.. తర్వాత కేబుల్ వైర్‌తో ఉరేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వీరాణం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మోనిష మేనత్త మోనికకు ఇద్దరు కుమారులు కాగా.. ఓ అబ్బాయి హతురాలి అక్కతో సన్నిహితంగా ఉండేవాడు. మార్చి 24న ఆ యువకుడి పుట్టినరోజు నాడు గోరత్తుపట్టికి వచ్చి మరదలికి కేక్ ఇచ్చాడు. అతడు ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి కేక్ ఇవ్వడం తంగరాజ్‌కు నచ్చలేదు. ఈ దృశ్యాన్ని చూసిన తంగరాజ్‌ వారిద్దరినీ అనుమానించాడు. ఆ రోజు పడిన అనుమానమే బీజం.. చివరకు ప్రాణాలు తీసేస్థాయికి చేరింది. మంగళవారం రాత్రి కత్తితో మోనిష గొంతుకోసి హతమార్చాడు. తర్వాత తాను కూడా కేబుల్ వైర్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : man murders wife and after commits suicide in salem in tamil nadu
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article