Rajendra G | Samayam Telugu | Updated: 08 Apr 2021, 01:49:00 PM
సునీల్ గవాస్కర్ ఆల్‌టైమ్ అత్యుత్తమ ఐపీఎల్ టీమ్‌లో ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు సురేశ్ రైనాకీ చోటు దక్కింది. అలానే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌లు భువనేశ్వర్ కుమార్, బుమ్రాకి ఈ టీమ్‌లో ఉండగా.. నలుగురు ప్రొఫెషనల్ బౌలర్లు...?
Rohit Sharma, MS Dhoni (Pic Source: Twitter)
ప్రధానాంశాలు:
- ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు మొదలు
- ఫస్ట్ మ్యాచ్‌లో ముంబయి, బెంగళూరు జట్లు ఢీ
- తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టుని ప్రకటించిన గవాస్కర్
- గవాస్కర్ జట్టులో నలుగురే ప్రొఫెషనల్ బౌలర్లు
గవాస్కర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ XI టీమ్: రోహిత్ శర్మ, క్రిస్‌గేల్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, మహేంద్రసింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, క్రిస్‌గేల్‌ని ఎంపిక చేసిన సునీల్ గవాస్కర్.. అనూహ్యంగా డేవిడ్ వార్నర్‌ని నెం.3 బ్యాటింగ్ స్థానానికి పరిమితం చేశాడు. దాంతో.. విరాట్ కోహ్లీ నెం.4లోకి వెళ్లగా.. ఐపీఎల్ 2020 సీజన్‌కి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నప్పటికీ.. సురేశ్ రైనాకి ఈ జట్టులో గవాస్కర్ అవకాశం కల్పించాడు. ఇక ఏబీ డివిలియర్స్, మహేంద్రసింగ్ ధోనీకి ఫినిషర్ బాధ్యతలు అప్పగించిన గవాస్కర్.. జడేజా, నరైన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకి చోటిచ్చాడు. అలానే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువీ, బుమ్రాకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కానీ.. టీమ్‌లో నలుగురే ప్రొఫెషనల్ బౌలర్లు ఉండటం గమనార్హం. టీ20ల్లో ఒక్కో బౌలర్ గరిష్ఠంగా 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే వెసులబాటు ఉంటుంది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : batting legend sunil gavaskar picks all-time ipl 11
Telugu News from Samayam Telugu, TIL Network