తగ్గిన క్రూడ్ ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం..

3 days ago 3

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 06:33:00 AM

పెట్రోల్ ధర నిలకడగానే ఉంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో పయనించింది. దీంతో దేశీ ఇంధన ధరలు ఈరోజు కూడా స్థిరంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు తగ్గాయి.

petrol price

ప్రధానాంశాలు:

  • స్థిరంగా పెట్రోల్‌ రేటు
  • డీజిల్ ధరదీ ఇదే దారి
  • క్రూడ్ ధరలు కిందకు
దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో గురువారం పెట్రోల్ ధర రూ.94.16 వద్ద, డీజిల్ ధర రూ.88.20 వద్ద నిలకడగానే కొనసాగుతున్నాయి. ధరలు స్థిరంగా ఉండటం ఇది వరుసగా 9వ రోజు.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.96.65 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్‌ ధర రూ.90.17 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.96.91 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.90.42 వద్ద నిలకడగా ఉంది.

Also Read: రోజుకు రూ.35తో రూ.37 లక్షలు సంపాదించండిలా..

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.90.56 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.80.87 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.96.98 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.87.96 వద్ద స్థిరంగా ఉంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.40 శాతం తగ్గుదలతో 62.80 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.74 శాతం క్షీణతతో 59.34 డాలర్లకు తగ్గింది.

ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : petrol and diesel rates today in hyderabad on 8th april 2021
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article