తూ.గో: ఓటు వేసి సెల్ఫీలు.. సోషల్ మీడియాలో వైరల్, షాకిచ్చిన కలెక్టర్

2 days ago 3

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 02:06:00 PM

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, పి.లక్ష్మీవాడ గ్రామాల్లో ఓటు వేసి బ్యాలెట్ పేపర్‌తో సహా సెల్ఫీలు తీసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లా జెడ్పీటీ, ఎంపీటీసీ ఎన్నిక పోలింగ్‌లో కొంతమంది యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, పి.లక్ష్మీవాడ గ్రామాల్లో ఓటు వేసి బ్యాలెట్ పేపర్‌తో సహా సెల్ఫీలు తీసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. వైరల్‌గా మారడంతో విషయం కలెక్టర్, ఎన్నికల అధికారులకు తెలిసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓట్లు చెల్లవని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రకటించారు. ఈ ఓట్లు వేసిన వ్యక్తులపై పోలీస్ కేసు నమోదు చేస్తామన్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సోషల్ మీడియాలో బ్యాలెట్ పేపర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.తూర్పుగోదావరి జిల్లా మాత్రమే కాదు.. మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే సీన్ కనిపించింది. కొంతమంది తాము ఓటు హక్కు వినియోగించుకున్నామని వేలికి ఉన్న సిరాతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు యువకులు మాత్రం అత్యుత్సాహంతో బ్యాలెట్ పేపర్‌తో సెల్ఫీలు దిగారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇలా సెల్ఫీలు దిగడం నిషేధం.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : east godavari district collector serious on youth selfie in polling booth with ballot papers
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article