తెలంగాణలో కరోనా ఉధృతి.. రెండువేలు దాటిన కేసులు

2 days ago 4

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 01:48:00 PM

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు రెండువేలు దాటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు,పట్టణాల్లో సైతం సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది.

తెలంగాణలో కరోనా విజృంభణ

తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా పాజిటివ్ కేసులు 2వేలు దాటాయి.నిన్న రాత్రి 8గంటల వరకు 87,332 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో కొత్తగా 2,055 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,741కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 303 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం 13,362 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వానికి కరోనా కేసుల విషయంలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఎక్కడ కేసులు ఎక్కువ ఉంటే వాటిని మైక్రో కంటోన్మెంట్‌ జోన్స్ కింద ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తెలంగాణకు వచ్చే ప్రతి ప్రయాణికుడి నుంచి తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్ సర్టిఫికెట్ తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : telangana reports 2055coronavirus cases on april 8th
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article