తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత..! ఇప్పుడెలా..?

2 days ago 5

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ కొరత ఏర్పడినట్టు కనిపిస్తోంది. వైరస్‌ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలు నిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సరఫరా లేక.. కొన్ని చోట్ల వ్యాక్సినేషన్‌కు ఇప్పటికే బ్రేక్ పడింది. ఇప్పటివరకు ఏపీకి కేంద్రం నుంచి 38లక్షల 44వేల డోస్‌లు అందగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 32 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు. ప్రస్తుతం అందుబాటులో 2 లక్షల 6 వేల డోసులు మాత్రమే ఉన్నాయి. వివిధ కారణాలతో రెండున్నర లక్షల డోసుల టీకా వృథా కాగా.. రోజుకు సరాసరి లక్ష మందికి పైగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 

మరోవైపు.. తెలంగాణకు ఇప్పటి వరకూ 24 లక్షల 50 వేల డోసుల వాక్సిన్ అందింది. అందులో 20 లక్షల డోసుల కోవిషిల్డ్ కాగా,  4 లక్షల 50 వేల డోసుల కోవాగ్జిన్‌ ఉంది. ఇంకా తొమ్మిది రోజులకు సరిపోయే వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 15న కేంద్రం నుంచి రానున్న వ్యాక్సిన్‌ డోసులపైనే.. తెలుగు రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. అది రావడం ఆలస్యమైతే.. వ్యాక్సిన్‌ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు కోవిడ్ ఉత్సవ్ పేరుతో వ్యాక్సినేషన్ కొనసాగాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.. 45 ఏళ్ల పైబడినవాళ్లు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అసలే వ్యాక్సిన్ నిల్వలు నిండు కోవడంతో.. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎలా సాగుతుందనే టెన్షన్ అధికారులకు పట్టుకున్నట్టు తెలుస్తోంది. 

Read Entire Article