Jakkula Balaiah | Samayam Telugu | Updated: 08 Apr 2021, 05:15:00 PM
మధ్యాహ్నం సమయంలో ఈరన్న భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతని మూడేళ్ల కూతురు టీవీ చూస్తోంది. రిమోట్ తీసుకుని న్యూస్ చానల్ పెట్టుకోవడంతో భార్య అడ్డుచెప్పింది. కూతురు నాన్నకి సపోర్ట్ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
చిన్న విషయానికే తల్లి గొడవపడడం చూసి చిన్నారి తండ్రికి వత్తాసు పలికింది. న్యూస్ చానల్ చూడనివ్వమంటూ.. తల్లిని నోర్మూసుకోమని వచ్చీరాని మాటలతో సరదాగా అనేసింది. నాన్నకి కూతురు వత్తాసు పలకడం అమ్మకి నచ్చలేదు. తనకంటే తండ్రినే ఎక్కువ ఇష్టపడుతోందని కోపం పెంచుకుని కూతురిని చంపేయాలని నిర్ణయించుకుంది. కూతురు గొంతునులిమి కిరాతకంగా హతమార్చింది. గుట్టుచప్పుడు కాకుండా చిన్నారి డెడ్‌బాడీని పడేసి హైడ్రామాకు తెరతీసింది.
మరుసటి రోజు కూతురు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంటికి సమీపంలోనే చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి మిస్సింగ్ కంప్లైంట్ ఉండడంతో వెంటనే ఈరన్న దంపతులను పిలిపించారు. కూతురు శవాన్ని చూసిన ఈరన్న, సుధ భోరున విలపించారు. అయితే తల్లి దొంగేడుపు చూసి ఖాకీలకు అనుమానం రావడంతో కథ అడ్డం తిరిగింది. సుధని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లోవ విచారించడంతో అసలు నిజం చెప్పేసింది. తనకంటే నాన్నంటేనే ఎక్కువ ఇష్టమని.. అది తట్టుకోలేక కూతురిని అంతం చేశానని చెప్పడంతో పోలీసులే షాక్‌కి గురయ్యారు. ఇదేం దారుణం బాబోయ్ అని నిర్ఘాంతపోయారు.
Also Read: జీతాలు తీసుకునే వారు అమరవీరులా.! చిచ్చురాజేసిన ‘ఆమె’ఫేస్బుక్ పోస్ట్
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : bengaluru: heartless mother kills 3 year old daughter for supporting father
Telugu News from Samayam Telugu, TIL Network