పవన్‌తో సినిమాకి వెరైటీ టైటిల్ అనుకుంటున్న హరీశ్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా మరీ..?

2 days ago 7

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 12:26:00 PM

మూడు సంవత్సరాల తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్‌సాబ్’గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు హరీశ్ శంకర్‌తోనూ పవన్ ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఓ వెరైటీ టైటిల్‌ని అనుకుంటున్నాడట.. దర్శకుడు హరీశ్

పవన్ కళ్యాణ్

‘వకీల్‌సాబ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’తో పాటు.. ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా రీమేక్ షూటింగ్‌లలో పాల్గొంటున్నారు పవన్. ఈ సినిమా తర్వాత ఆయన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో తనకు సూపర్ హిట్ అందించిన దర్శకుడు హరీశ్ శంకర్‌తో మరో సినిమాను చేయనున్నారు. ఇప్పటికే హరీశ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి చేశాడు. ఆల్రెడీ ఈ స్టోరీ విన్న పవన్ వెంటనే ఓకే చెప్పారని.. దీంతో హరీశ్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ఓ ఆసక్తికరమైన టైటిల్‌ని అనుకుంటున్నాడట దర్శకుడు హరీశ్ శంకర్. ‘సంచారి’ అనే టైటిల్‌తో ఈ సినిమాని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ టైటిల్ చర్చల దశలోనే ఉందని సమచారం. పవన్‌కు మరోసారి కథను వినిపించిన తర్వాత టైటిల్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందట.

అయితే ఈ టైటిల్‌ను పవన్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. అనే టాక్ కూడా వినిపిస్తుంది. ‘వకీల్‌సాబ్’ చిత్రానికి ముందు పవన్ కళ్యాణ్ నటించిన ఆఖరి చిత్రం ‘అజ్ఞాతవాసి’. భారీ అంచనాల నడుమ.. పవన్‌కళ్యాన్ 25వ సినిమాగా.. పైగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. రిజల్డ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు హరీశ్ అనుకుంటున్న ‘సంచారి’ అనే టైటిల్ కూడా కొంచెం అజ్ఞాతవాసి స్టైల్‌లోనే ఉంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ టైటిల్‌తో ఏకీభవించపోవచ్చని కొందరు అంటున్నారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : harish shankar thinking about a interesting title for his movie with pawan kalyan
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article