పూర్తికాలం సీఎం.. తర్వాత గవర్నర్, రాష్ట్రపతి.. సీఎం జాతకం చెప్పిన ఆ స్వామీజీ!

2 days ago 3

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 02:40:00 PM

కర్ణాటక రాజకీయాల్లో అసమ్మతి గళం తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంటి పోరు తట్టుకోలేక సతమతమవుతున్నారు. తన సీఎం పదవికి ఉడగొడతారనే ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక జైనముని స్వామి

ప్రధానాంశాలు:

  • సొంత పార్టీ నుంచే యడియూరప్పకు సెగలు.
  • సీఎం మార్పు తథ్యమని కన్నడనాట ప్రచారం.
  • స్వామీజీ ఆశీర్వాదంతో ఊపిరిపీల్చుకున్న యడ్డీ.
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. విపక్షాల నుంచే కాక సొంత పార్టీ నేతలు తిట్లు, శాపనార్ధాలతో యడ్డీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇటీవల కాలంలో అసమ్మతి రాగాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో యడియూరప్పకు జైనముని బాలాలచార్య సిద్ధసేన స్వామి నుంచి లభించిన ఆశీర్వచనాలు ఆయనకు కొంత స్వాంతన కలిగించాయి. మంగళవారం సాయంత్రం బెళగావి సమీపంలోని బాలాల జైన బసదిని ఆశ్రమాన్ని సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా జైన మునితో ఆయన పలు విషయాల గురించి ముచ్చటించారు.

‘పూర్తికాలం సీఎంగా అధికారంలో ఉంటావు. అనంతరం గవర్నరుగా, ఆ తరువాత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తావు’అని ముఖ్యమంత్రిని జైన ముని ఆశీర్వదించారు. తాను ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చానని తెలిపిన సీఎం.. బెళగావిలో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి జైనముని సమాధానమిస్తూ కనీసం 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు ఖాయమని చెప్పారు. అంతేకాదు, మీరు పూర్తికాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు.. ఆ తరువాత గవర్నరు, రాష్ట్రపతి హోదాలు వరిస్తాయని చెప్పారు.

ముని ఆశీర్వాదంతో సీఎం యడియూరప్ప సంతోషంతో ఉబ్బితబ్బుబ్బి అవుతున్నారు. తన పదవికి ఇక ఢోకా లేనట్లేనని ఆయన ఆనందం వ్యక్తం చేసినట్లు సన్నిహితులు తెలిపారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మే 2 తరువాత నాయకత్వ మార్పు తథ్యమని సొంత పార్టీ నేతలు పదేపదే ప్రకటించడంతో ముఖ్యమంత్రి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అరుణ్‌సింగ్‌ తనకు పూర్తిగా అనుకూలంగా ఉన్నా ఎక్కడో భయం ఆయనను వెంటాడేది. ఇప్పుడు జైనముని ఆశీర్వచనాలు ఆయనలో ఆత్మస్థైర్యాన్ని నింపాయని విశ్లేషకులు అంటున్నారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : karnataka cm yediyurappa will complete term, become governor, president predicts jain seer
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article