ప్రజలకు ఈ ఎన్నికలు ఇష్టం లేదు : జేసీ ప్రభాకర్ రెడ్డి

2 days ago 8

Apr 8, 2021 10:02 PM

 జేసీ ప్రభాకర్ రెడ్డి

చంద్రబాబు ఆదేశాలు మేరకు జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు బహిష్కరించాము. ఎప్పుడు లేని విధంగా తాడిపత్రిలో 70 శాతం పోలింగ్ జరిగేది కానీ ఇప్పుడు 25 నుంచి 30 శాతానికి పడిపోయింది. దాంతో ప్రజలు ఈ ఎన్నికలు ఇష్టం లేదని అర్థమవుతుంది అని తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో చాలామంది చాలా ఉత్సాహంగా ఉన్నారు కౌన్సిలర్ లను కొనుగోలు చేశారంటా  నాకు నాలుగు సంవత్సరాల వరకు ఎవరు గద్దె దింపలేరు. మున్సిపాలిటీ పబ్లిక్ కొలాయి కి మోటర్ వేసి నీళ్లు ఇంటికి సరఫరా చేస్తుంటే మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం మోటార్ ను ఎత్తుకెళ్లారు దానికి ఎఫ్ఐఆర్ ఆగమేఘాలమీద నమోదు చేశారు. మేము ఎన్నికలను బహిష్కరిస్తే కూడా  చాలా చోట్ల రిగ్గింగ్ చేశారు. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదు. 2 సంవత్సరాల క్రితం ప్రబో నంద స్వామి కేసులో ఇప్పుడు అరెస్టు చేస్తున్నారు పోలీసులు. మా లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మాకు 150 ఇబ్బందులు. తాడపత్రి లో పోలీసులు చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్లు చేసినవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. తాడిపత్రి లో ఎన్నడూ లేని విధంగా 25 నుంచి 30 శాతానికి ఓటింగ్ శాతం పడిపోయింది. ప్రజలు ఓట్లు వేయడానికి మొగ్గుచూపడం లేదా అనేది నాకు అర్థం కావడం లేదు అని అన్నారు జేసీ.

Read Entire Article