ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.. రెండింటిలో ఏది బెటర్..?

2 days ago 4

కరోనా సెకండ్ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది.. మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని చెబుతున్నారు నిపుణులు.. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు. ఇక, ఈ నెల 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది ప్రభుత్వం.. కరోనా రెండో దశ భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో... ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇక, దేశంలో అందుబాటులో ఉన్న  రెండు వ్యాక్సిన్లలో ఏది బెటర్? అనే చర్చ కూడా సాగుతుండగా.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూల్లో రెండు వాక్సిన్ల పనితీరులో ఎలాంటి తేడాలు లేవంటున్నారు. డాక్టర్ రంగారెడ్డి.. అంతేకాదు రెండు వాక్సిన్లను పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా పరిశీలించాలకే అనుమతులు ఇచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వాక్సినే కావాలని డిమాండ్ చేయకుండా... అందుబాటులో ఉన్న వాక్సిన్ వేసుకోవాలంటున్నారు. ఇక, ఎన్టీవీ ప్రత్యేకంగా మాట్లాడిన డాక్టర్ రంగారెడ్డి.. ఇంకా ఏం చెప్పారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. 

Read Entire Article