ప్రముఖ సినీ నటికి కరోనా.. టీకా తీసుకున్న కొన్ని రోజుల్లోనే పాజివిట్.. కారణం తెలిస్తే షాక్..

2 days ago 5

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 03:53:00 PM

రెండో దశలో కరోనా వైరస్ దేశవ్యాప్తంగా రెట్టింపు వేగంతో వ్యాపిస్తుంది. మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ వినియోగం కూడా అంతే శరవేగంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ తీసుకున్న కొందరూ కరోనా బారిన పడున్నారు. తాజాగా సిని నటి నగ్మా విషయంలోనూ ఇలాగే జరిగింది.

నగ్మా

చైనాలో పుట్టిన కరోనా వైరస్.. గత ఏడాది యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. అందులో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ లాక్‌డౌన్ సమయంలో శాస్త్రవేత్తల కృషితో కరోనా వ్యాక్సిన్ తయారీ జరిగింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వం ఆమోదించడంతో.. వ్యాక్సిన్ వినియోగం శరవేగంగా జరుగుతోంది. మరోవైపు లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తి వేయడంతో రెండో దశలో కరోనా రెట్టింపు వేగంతో వ్యాపిస్తోంది. ఓవైపు ఈ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నా.. మరోవైపు ప్రజలు భయం మరిచి కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ మరింత సులభంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ప్రముఖ సినీ తారలు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో నగ్మా కూడా చేరింది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజులకే నగ్మాకు కరోనా సోకడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

తనకు కరోనా సోకిన విషయాన్ని నగ్మా సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. అయితే వ్యాక్సిన్ విషయంలో తనకు ఎటువంటి అసంతృప్తి లేదని ఆమె తెలిపింది. ‘‘కొద్ది రోజుల క్రితం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో నేను వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లాను. వాక్సిన్ ఏమాత్రం అసంతృప్తి పరచదు కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకండి ’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. అంటే నగ్మా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తనకు కరోనా సోకినట్లు చెప్పకనే చెప్పారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉంటేనే మంచిదంటూ నెటిజన్లు భావిస్తున్నారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : actress nagma tests corona positive even after taking vaccine
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article