బంగారం కొనే వారికి బంపరాఫర్.. ఏకంగా రూ.10 వేల తగ్గింపు!

2 days ago 4

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 12:42:00 PM

బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ.10 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.

gold prices

ప్రధానాంశాలు:

  • పసిడి ప్రేమికులకు శుభవార్త
  • అదిరిపోయే ఆఫర్
  • భారీ తగ్గింపు
బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు లభిస్తోంది. డైమండ్ జువెలరీ కొనుగోలుపై రూ.10 వేల వరకు తగ్గింపు ఉంది. అయితే కనీసం రూ.80 వేలకు కొనుగోలు చేయాలి. అలాగే బంగారు ఆభరణాలపై కూడా రూ.10 వేల డిస్కౌంట్ ఉంది. కనీసం రూ.60 వేలకు కొనుగోలు చేయాలి.

అయితే ఈ ఆఫర్లు కల్యాణ్ జువెలర్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీరు ఉగాది పండుగకు ఆభరణాలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే.. ఇది మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. మీ దగ్గరిలోని కల్యాణ్ జువెలర్స్‌కు వెళ్లి ఆభరణాలు కొనొచ్చు.

Also Read: ఈ ఎల్‌ఐసీ పాలసీతో ప్రతి సంవత్సరం మీ చేతికి రూ.23 వేలు.. ఇలా చేరండి!

కేవలం కల్యాణ్ జువెలర్స్‌లో మాత్రమే కాకుండా పీసీ జువెలర్స్‌లో కూడా ఆఫర్ అందుబాటులో ఉంది. పీసీ జువెలర్స్ రిటైల్ స్టో్ర్ లేదా వెబ్‌సైట్‌లో మీరు ఆభరణాలు కొనుగోలు చేస్తే 7.5 శాతం తగ్గింపు వస్తుంది. గరిష్టంగా రూ.7,500 వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.

ఇంకా గ్రాసరీ కొనుగోలుపై ఆఫర్లు ఉన్నాయి. డీమార్ట్‌లో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తోంది. అమెజాన్ సూపర్ వ్యాల్యూ డేస్‌లో కొనుగోలు చేస్తే 10 శాతం ఆదా చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో గ్రాసరీ కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్స్‌లో ఏసీ, ఫ్రిజ్, కూలర్, టీవీ, వాషింగ్ మెషీన్ వంటివి కొంటే తగ్గింపు లభిస్తోంది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : icici bank idelights summer bonanza check discounts deals offers and more
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article