Shaik Begam | Samayam Telugu | Updated: 08 Apr 2021, 12:34:00 PM
మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ నిర్వహించిన ధూమ్ ధామ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అనుచరుడు విజయభాస్కర్ రెడ్డిని తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యారు.
మంత్రి కంటతడి
ప్రధానాంశాలు:
- టీఆర్ఎస్ పార్టీ ధూమ్ ధామ్
- అనుచరుడి అకాల మరణంతో మంత్రి కంటతడి
- కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి
అయితే ఈ సభకు మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్, ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తో పాటు సీనియర్ నేత సి. కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధూమ్ ధామ్ కు ముందు ఇటీవల మరణించిన పెద్దవూర గ్రామ సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మట్లాడుతూ కర్నాటి విజయ భాస్కర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. ఆయన పార్టీ కోసం పనిచేసిన తీరును ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి... విజయభాస్కర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : minister jagadish reddy feel emotional in nalgonda party meeting
Telugu News from Samayam Telugu, TIL Network