బేగంబజార్‌లో కరోనా పంజా.. 100కి పైగా పాజిటివ్ కేసులు, వ్యాపారుల షాకింగ్ నిర్ణయం

2 days ago 5

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 12:04:00 PM

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో దుకాణాల తెరిచే వేళల్లో మార్పులు చేశారు. వ్యాాపారులు. శుక్రవారం నుంచి ఉదయం 9 గంటలకు తెరిచి.. సాయంత్రం 5 గంటలకు మూసివేయాలని నిర్ణయించారు.

Image

ప్రధానాంశాలు:

  • బేగంబజార్‌లో కరోనా పంజా
  • 100 మందికి పైగా పాజిటివ్ కేసులు
  • వేళల్లో కీలక మార్పులు చేసిన వ్యాపారులు
తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ అయిన హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వ్యాపారులు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడటంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఆ ప్రాంతంలో ఇప్పటివరకు 100 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చిందంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

బేగంబజార్‌కు రోజూ రాష్ట్రం నలుమూలల నుంచి సుమారుం 50వేల మంది వరకు వస్తుంటారు. అక్కడ వీధులన్నీ కనీసం కాలు పెట్టడానికి కూడా వీల్లేనంత రద్దీగా ఉంటాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో బేగంబజార్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి దుకాణాల వేళలను మార్చారు. శుక్రవారం నుంచి ఉదయం 9 గంటలకు దుకాణాలు తెరిచి సాయంత్రం 5 గంటలకు మూసివేస్తామని ది హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్‌ అగర్వాల్‌లు ప్రకటించారు.

బేగంబజార్‌తో పాటు ఛత్రి, ఫిష్‌ మార్కెట్, మిట్టికా షేర్‌ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్‌ కిరాణ దుకాణాలన్నీ తమ అసోసియేషన్‌ నిబంధనలు పాటిస్తాయని వారు తెలిపారు. ప్రతి దుకాణం వద్ద కొనుగోలుదారులు, వ్యాపారస్తులు మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్‌ వాడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరోనా అదుపులోకి వచ్చేవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అసోసియేషన్ తెలిపింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : hyderabad begum bazar shops will close after 5pm friday onwards due to corona effect
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article