Shaik Begam | Samayam Telugu | Updated: 08 Apr 2021, 12:57:00 PM
గతనెలలో కొన్న11 ఎకరాల భూమిని రైతు చదును చేయడం ప్రారంభించడం. అయితే ఈ పనుల్లో లంకెబిందె కనిపించింది.దాన్ని బయటకు తీసిన రైతు బిందె నిండా బంగారం చూసి అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
భూమిలో బయటపడ్డ బంగారం
ప్రధానాంశాలు:
- భూమిని చదును చేస్తుండగా బయటపడ్డ లంకెబిందె
- బిందె నిండా బంగారం
- పోలీసులకు సమాచారం అందించిన రైతు
జనగామ జిల్లా పెంబర్తికి చెందిన నర్సింహా అనే రైతు తన భూమిని చదును చేస్తుండగా భూమిలో అతనికి రెండు లంకెబిందెలు బయటపడ్డాయి. వెంచర్ కోసం 11 ఎకరాల భూమి కొనుగోలు చేయగా నేడు భూమి చదును చేస్తున్న క్రమంలో లంకె బిందె కనిపించింది. భూమిలో బంగారం బయటపడటంతో వెంటనే ఆ రైతు అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అధికారులు లంకెబిందెలను స్వాధీనం చేసుకున్నారు. లంకెబిందెల్లో సుమారు 5 కేజీల బంగారం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని పరీక్షల నిమిత్తం పురావస్తు శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. బంగారం ఈ కాలంనాటిది.. లేదా పురాతన కాలానికి చెందినదా అన్న విషయాన్ని పురావస్తు శాఖ అధికారులు తేలుస్తారన్నారు. మరోవైపు లంకెబిందెలు దొరకడంతో ఆ సొమ్ముతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : farmer finds 5 kg gold pot in land leveling works at jangaon district
Telugu News from Samayam Telugu, TIL Network