మరో సీఎంకు కరోనా.. వ్యాక్సినేషన్ తర్వాత కూడా...!

2 days ago 5

Apr 8, 2021 08:20 PM

మరో సీఎంకు కరోనా.. వ్యాక్సినేషన్ తర్వాత కూడా...!

ఇప్పటికే పలువురు సీఎంలను, కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను.. ఉన్నతాధికారులను ఇలా ఎవ్వరు దొరికితే వాళ్లు అనే తరహాలో కరోనా వైరస్ సోకింది.. ఇక, ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ.. కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. తాజాగా,  కేరళ సీఎం పినరయి విజయన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. సీఎంకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అయితే, గత నెల 3వ తేదీన వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నరు కేరళ సీఎం.. కానీ, తాజాగా నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో మాత్రం.. కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు పినరయి విజయన్.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థులను మరోసారి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.. ఈ నెల 6వ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. వచ్చే నెల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకడంపై స్పందించిన సీఎం పినరయి విజయన్.. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ప్రస్తుతం కోజికోడ్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స తీసుకుంటున్నా.. గత కొద్దిరోజులుగా నాతో కాంటాక్ట్‌ అయిన వారు వెంటనే టెస్టులు చేయించుకోవాలని, సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. 

Read Entire Article