మిసెస్‌ శ్రీలంక పోటీల్లో నాటకీయ పరిణామాలు.. అసలు ఏం జరిగిందంటే..?

2 days ago 3

మిసెస్‌ శ్రీలంక కిరీటానికి పుష్పికా డి సిల్వాయే అర్హురాలని తేల్చారు నిర్వాహకులు. వేదికపై ఆమెకు జరిగిన అవామానానికి క్షమాపణ చెప్పడంతో... కిరీటాన్ని అందజేశారు. అంతకు ముందు మిసెస్‌ శ్రీలంక పోటీల్లో భాగంగా నాటకీయ పరిణామాలు జరిగాయి. పుష్పికా డి సిల్వాను విజేతగా ప్రకటించిన నిర్వాహకులు... ఆమెకు కిరీటం తొడిగారు. అయితే... ఈ ఆనందం ఆమెకు ఎంతో సేపు నిలవలేదు. పుష్పిక భర్త నుంచి విడాకులు తీసుకోవడం వల్ల పోటీకి అనర్హురాలని ప్రకటించింది మాజీ మిసెస్ శ్రీలంక కరోలిన్ జ్యూరీ. అంతేకాదు... వేదికపైనే పుష్పిక నుంచి కిరీటాన్ని లాక్కుని... ఫస్ట్‌ రన్నరప్‌కు దానిని అలంకరించింది కరోలిన్‌ జ్యూరీ. దీనిని అవమానంగా భావించిన పుష్పిక అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాను భర్త నుంచి విడాకులు తీసుకోలేదని, తనకు జరిగిన అవమానంపై న్యాయ విచారణ జరిపించాలంటూ ఫేస్‌ బుక్‌లో పోస్టు చేసింది పుష్పిక. 

మాజీ మిసెస్ శ్రీలంక కరోలిన్ జ్యూరీ తీరుతో నిర్వాహకులు కూడా కంగుతిన్నారు. షాక్‌ నుంచి తెరుకునే లోపే మొత్తం జరిగిపోయింది. అయితే, పుష్పికా డి సిల్వాయే అన్ని విధాలా అర్హురాలని... అందువల్లే ఆమెను న్యాయనిర్ణేతలు విజేతగా ప్రకటించారని స్పష్టం చేశారు మిసెస్‌ శ్రీలంక పోటీల నిర్వాహకులు. వేదికపై జరిగిన దానికి ఆమెకు క్షమాపణ చెప్పారు. అంతేకాదు... పుష్పిక భర్త నుంచి విడాకులు తీసుకోలేదని కూడా స్పష్టం చేశారు. 2011లో మిస్ శ్రీలంక కిరీటాన్ని దక్కించుకున్నారు పుష్పిక డి సిల్వా. 

Read Entire Article