మొన్న తండ్రి నేను తల్లి ఆత్మహత్య, ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకోనున్న జానా కుమారుడు !

2 days ago 6

కరోనా కష్టాలు భరించలేక మొన్న నాగార్జున సాగర్ కు చెందిన ప్రైవేటు టీచర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఉక్కిరిబిక్కిరవుతూ అర్ధాకలితో అలమటిస్తుంటే ఈ కష్టాలు తాను భరించలేనంటూ కట్టుకున్న భార్య పుట్టింటికి వెళ్లి పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో జరిగిన ఈ ఘటన విషాదం రేపింది. నాగార్జునసాగర్ హిల్ కాలనీలో నివాసం ఉంటున్న రవి (30) డివైన్ మెర్సీ స్కూల్లో ప్రైవేట్ టీచర్ గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఏడాదిగా ప్రైవేట్ స్కూల్లో జీతాలు రాక కుటుంబాన్ని పోషించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇల్లు గడవడం కష్టమైపోవడంతో నిన్న రాత్రి భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భార్య ఇల్లు విడిచి పోవటంతో మనస్థాపానికి గురైన రవి తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ తరుణంలో భర్త మరణాన్ని తట్టుకోలేక, ఆయన మరణానికి తానే కారణం అని భావించిన భార్య అక్కమ్మ నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. దంపతుల ఆత్మహత్యలతో  ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. దీంతో చిన్నారులను దత్తత తీసుకుంటానని జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరారెడ్డి తెలిపారు. చిన్నారుల చదువు, వసతి సౌకర్యం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని తానే చూసుకుంటానని ప్రకటించారు. నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్స్ ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. తెగించి కొట్లాడి హక్కులు సాధించుకుందామని ఆయన అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ  సీఎం కేసీఆర్ ప్రభుత్వ హత్యలే అని రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు.

Read Entire Article