Gvn Apparao | Samayam Telugu | Updated: 08 Apr 2021, 07:53:00 AM
ప్రభుత్వ యంత్రాంగం, అధికారుల లోటుపాట్లు, లోపాలు, తప్పిదాలను ఎత్తిచూసి ప్రజలను చైతన్యవంతం చేయాాల్సిన మీడియానే తప్పులో కాలేసి విమర్శలను ఎదుర్కొంటోంది.
వ్లాదిమిర్ పుతిన్
ప్రధానాంశాలు:
- అత్యాచార ఘటనలో జర్నలిస్ట్‌కు అరెస్ట్ వారెంట్.
- పుతిన్ ఫోటోతో వార్తను ప్రచురించిన ప్రతిక.
- భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు.
ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దుమారమే రేగుతుండగా.. వెంటనే సదరు పత్రికా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అత్యాచార ఘటనలో ముంబైకి చెందిన వరుణ్ హిరేమాత్ అనే జర్నలిస్ట్‌కు న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, ఈ వార్తలో జర్నలిస్ట్ వరుణ్ ఫొటోకి బదులుగా పుతిన్ ఫొటోను ప్రచురించారు. పుతిన్ ఫోటోతకూడిన వార్తను ఫోటోతీసి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తే, ఇంకొందరు పత్రికా తప్పిదంపై మండిపడుతున్నారు. ఈ వార్తకు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన ఓ నెటిజన్.. ‘‘ఇది చాలా పెద్ద తప్పిదం. సదరు పత్రిక తక్షణమే క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’ అని హెచ్చరిస్తూ పోస్ట్ చేశాడు. ‘‘వార్తలో ఫొటో పెట్టమని నోట్లో పేర్కొన్నారు.. ‘పుట్ ఇన్ పిక్చర్’ అని ఇంగ్లీషులో రాసుంది. అందుకే ‘పుతిన్’ ఫొటో తీసుకున్నారు’’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు.
‘బాధ్యతలేని వ్యక్తులు ఏం చేస్తున్నారో వారికే అర్ధంకావడం లేదు.. అత్యాచార ఘటన దేశం, గొప్ప నేత పరువు తీసిందని గుర్తించలేదు’ అని నెటిజన్ మండిపడ్డాడు. ‘పుతిన్ నిక్ నేమ్ వరుణ్ హిరేమాత్ అని నాకు తెలియదు’ మరో వ్యక్తి.. అత్యాచారానికి పాల్పడింది వరుణ్ హిరేమాత్నా? రష్యా అధ్యక్షుడా? అంటూ ఇంకో నెటిజన్ ట్వీట్ చేశారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్బుక్ పేజీను లైక్ చెయ్యండి.
మరింత సమాచారం తెలుసుకోండి
Web Title : newspaper publishes russian president putin's picture instead of rape accused
Telugu News from Samayam Telugu, TIL Network