'లవ్ స్టోరీ' విడుదల వాయిదా!

2 days ago 5

Apr 8, 2021 05:39 PM

'లవ్ స్టోరీ' విడుదల వాయిదా!

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఈ నెల 16న ఈ సినిమాను వరల్డ్ వైడ్ విడుదల చేయడానికి నిర్మాతలు సర్వసన్నాహాలు చేశారు. ప్రమోషన్ యాక్టివిటీస్ సైతం పీక్స్ కు చేరాయి. తాజాగా ఆహా ఓటీటీ కోసం రానా ఈ చిత్ర బృందంతో 'యారి నెంబర్ 1' ప్రోగ్రామ్ ను చేశాడు. దానికి సంబంధించిన ప్రోమో సైతం ఇవాళే విడుదలైంది. అయితే... దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణాలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టమని కోరింది. దీంతో అతి త్వరలోనే థియేటర్ల ఆక్యుపెన్సీ సైతం యాభై శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని 'లవ్ స్టోరీ' చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ తెలిపారు. ఈ పేండమిక్ సిట్యూయేషన్ తొలగిపోయిన తర్వాత తమ సినిమాను విడుదల చేస్తామని, ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టే ఆలోచన తమకు లేదని అన్నారు. పరిస్థితులు చక్కబడేవరకూ వేచి ఉంటామని ఆయన చెప్పారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలు చిత్రాల విడుదల కారోనా కారణంగా వాయిదా పడగా, ఇప్పుడు టాలీవుడ్ లోనూ నిర్మాతలు పునరాలోచనలో పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో మిగిలిన చిత్రాల నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Read Entire Article