లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఈ ఈద్ కాకపోతే నెక్ట్స్ ఇయరే అంటోన్న సల్మాన్

2 days ago 3

కరోనా ఎఫెక్ట్ తో దేశంలోని అన్ని సినిమా రంగాలు కుదేలయ్యాయి. అయితే, బాలీవుడ్ మాత్రం ఫస్ట్ వేవ్ నుంచీ తేరుకుంటూ ఉండగానే మహారాష్ట్రలో సెకండ్ వేవ్ వచ్చి మీద పడింది. అందుకే, ముంబై సినీ స్టార్స్ అందరూ టెన్షన్ గా ఉన్నారు. సల్మాన్ కూడా ప్రస్తుతం తల పట్టుకునే కూర్చున్నాడు! సల్మాన్ కు కేవలం ఒక్క సినిమాతో కాక రెండేసి చిత్రాలతో తలనెప్పులు ఎదురవుతున్నాయి. ఆయన నటించిన 'రాధే' సినిమా ఇప్పటికే పూర్తైపోయింది. విడుదల మాత్రమే మిగిలి ఉంది. మే నెలలో రంజాన్ సందర్బంగా రిలీజ్ చేద్దామని భావించారు. కానీ, ఇప్పుడు మహారాష్ట్ర మళ్లీ లాక్ డౌన్ లాంటి స్థితిలోకి వెళ్లిపోయింది. ఏప్రెల్ 30 దాకా థియేటర్లు మూతపడ్డాయి. ఆ తరువాత కూడా తప్పకుండా తెరుచుకుంటాయని గ్యారెంటీ లేదు. అందుకే, సల్మాన్ ఇక తన సినిమా ఈ రంజాన్ కి రాకపోవచ్చని అంటున్నాడట. కరోనా కల్లోలం కంటిన్యూ అయితే వచ్చే సంవత్సరం ఈద్ వరకూ 'రాధే' వాయిదా వేస్తామని సల్మాన్ బాంబు పేల్చాడు. కాకపోతే, తనకు ఇంకా కరోనా సెకండ్ వేవ్ త్వరగా తగ్గిపోతుందని నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చాడు. 

'రాధే' ఈ రంజాన్ కి కాకుండా ఆపై రంజాన్ కి విడుదలైతే ఎలా? సల్మాన్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఇదొక్కటే ప్రశ్న కాదు... మరో సమస్య కూడా వార్ని వేధిస్తోంది! సల్మాన్, కత్రీనా జంటగా 'టైగర్ 3' రూపొందుతోంది. కానీ, క్యాట్ వైరస్ బారిన పడటంతో ప్రస్తుతం క్వారంటైన్ అయింది. ఆమె తిరిగి వచ్చాకే షూటింగ్ పూర్తి స్థాయిలో కొనసాగుతుందట. అంత వరకూ సల్మాన్ ఒక్కడు మాత్రమే పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఒకవేళ అనుకున్న టైంకి కత్రీనా షూటింగ్ కి హాజరు కాకపోతే 'టైగర్ 3' కూడా ఆలస్యం అవ్వొచ్చని అంటున్నారు. చూడాలి మరి, 'రాధే, టైగర్ 3' చిత్రాల్ని సల్మాన్ ఎలా, ఎప్పుడు జనం ముందుకి తీసుకు వస్తాడో!

Read Entire Article