విజయనగరం: 2 నెలల క్రితం మిస్సింగ్, తర్వాత ఆత్మహత్య అన్నారు.. దర్యాప్తులో సంచలన విషయాలు

2 days ago 4

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 09:21:00 AM

పినవేమలికి చెందిన కె.రవికుమార్‌ ఫిబ్రవరి 17న మిస్ అయ్యాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అదే నెల 19న నేల బావిలో శవమై కనిపించాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.

విజయనగరం జిల్లా

ప్రధానాంశాలు:

  • ఫిబ్రవరి 17న యువకుడి మిస్సింగ్
  • రెండ్రోజులకు బావిలో డెడ్‌బాడీ
  • దర్యాప్తులో సంచలన విషయాలు
విజయనగరం జిల్లాలో యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. రెండు నెలల క్రితం కనిపించకుండాపోగా.. బావిలో డెడ్‌బాడీని గుర్తించారు. ముందు ఆత్మహత్య చేసుకున్నారా అని అనుమానించారు.. తర్వాత స్నేహితులే నమ్మించి అతడ్ని దారుణంగా హత్య చేసినట్లు తేల్చారు. పినవేమలికి చెందిన కె.రవికుమార్‌ ఫిబ్రవరి 17న మిస్ అయ్యాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అదే నెల 19న నేల బావిలో శవమై కనిపించాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో అతడి స్నేహితులపై అనుమానం పెరిగింది. ఊరి చివర తోటలో రవి తన స్నేహితులు పైడిరాజు, మరో మగ్గురు పార్టీ చేసుకోవడం.. అంతా కలిసి తిరుపతికి వెళ్లారని పోలీసుల విచారణలో తేలింది. వారిని ప్రశ్నిస్తే ఈ కేసు మిస్టరీ వీడింది.. అతడ్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

పైడిరాజుకు గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె రవికుమార్‌తో కూడా చనువుగా ఉండేది. దీన్ని చూసి తట్టుకోలేక రవికుమార్‌తో గొడవపడ్డాడు.. చివరికి హత్య చేయాలని భావించాడు. ఫిబ్రవరి 17న సర్పంచి ఎన్నికలు, గెలుపు సంబరాలు ఉన్నాయి. ఈ సమయంలో చంపితే ఎన్నికల హడావుడిలో జరిగిందని అందరూ అనుకుంటారని ప్లాన్ చేశాడు. ఊరి చివర తోటలో స్నేహితులతో మందు పార్టీ ఏర్పాటు చేశాడు. పైడిరాజు, ఉదయ్‌కిరణ్‌, నారాయణరావు, సత్యనారాయణ, రవికుమార్‌ను పిలిచాడు.

రవి కుమార్ మద్యం మత్తులో ఉన్న సమయంలో మెడకు పైడిరాజు తాడును బిగించి చంపాడు. డెడ్‌బాడీని ఏం చేయాలో తెలియక మిగిలిన స్నేహితులకు చెప్పాడు. ఆత్మహత్యగా సీన్ క్రియేట్ చేద్దామనుకున్నారు. చీరను తెచ్చి మెడకు బిగించి చెట్టుకు ఉరి తీశారు.. బరువు ఉండటంతో చెట్టు కొమ్మ విరిగింది. మళ్లీ ఏం చేయాలో అర్ధం కాలేదు. అప్పుడే నారాయణరావు ఓ సలహా ఇచ్చాడు.. కాళ్లకు తాళ్లు, రాళ్లు కట్టేసి నేల బావిలో పడేస్తే మృతదేహం పైకి తేలదని చెప్పాడు. రవి డెడ్‌బాడీని అదే పనిచేశారు. చివరకు తేలడంతో పోలీసులు హత్యగా నిర్ధారించుకున్నారు. నిందితుడు పైడిరాజు, అతడికి సహకరించిన ముగ్గుర్ని రిమాండుకు తరలించారు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : vizianagaram: police arrested four persons in murder case
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article