వ్యాక్సినేషన్‌పై కేంద్రం రూల్స్.. యూత్‌ అసహనం..!

2 days ago 4

Apr 8, 2021 06:42 PM

వ్యాక్సినేషన్‌పై కేంద్రం రూల్స్.. యూత్‌ అసహనం..!

ఇప్పుడు రెండింటిపైనే ప్రముఖంగా చర్చ సాగుతోంది... ఒక్కటి కరోనా వైరస్ అయితే.. రెండోది దానిని కట్టడి చేసి వ్యాక్సిన్‌పైనే అందిరి దృష్టి.. కరోనాకు మందులేదు.. వాక్సిన్ మాత్రమే రక్ష అంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే వాక్సినేషన్‌లో కేంద్రం పెట్టిన రూల్స్‌ యూత్‌కు ఇబ్బంది పెడుతున్నాయి. ఇంట్లో ఉండే వారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు గానీ... రోజూ బతుకుదెరువు కోసం బయట తిరుగుతున్న వాళ్లను పక్కనపెడుతున్నారని వాపోతున్నారు. తమతో పాటూ తమ కుటుంబాలు వైరస్ భారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకూ వ్యాక్సిన్‌ ఇవ్వాలని యువత డిమాండ్‌ చేస్తోంది. కుటుంబపోషణ కోసం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల పనుల కోసం బయట ఉండే తమకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే అంటున్నారు. కాగా, మొదట్లో కరోనా వారియర్స్‌కు ఆ తర్వాత వృద్ధులకు.. ఇంకా ఆ తర్వాత 45 ఏళ్లు పైబడి అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాక్సినేషన్ జరగగా.. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారు అందరికీ వ్యాక్సినేషన్ జరుగుతోన్న సంగతి తెలిసిందే.. మరి, యూత్ డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందేమో చూడాలి. 
 

Read Entire Article