వ్యాక్సిన్ తీసుకున్నా... ప్రముఖ నటికి కరోనా పాజిటివ్

2 days ago 4

Apr 8, 2021 08:53 AM

వ్యాక్సిన్ తీసుకున్నా... ప్రముఖ నటికి కరోనా పాజిటివ్

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో కరోనా మళ్ళీ వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్‌ అందరికి సోకుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. అయితే.. కరోనా బారీన పడి చాలా మంది కోలుకున్నారు. అయితే.. ఇప్పుడు వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ... కరోనా సోకుతుంది. దీంతో అందరిలోనూ కలవరం మొదలైంది. తాజాగా..  ప్రముఖ నటి, కాంగ్రెస్‌ నేత నగ్మాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నగ్మా ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2న ఆమె ముంబైలో కరోనా ఫస్ట్‌ డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే... కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నా.. తాజాగా నగ్మా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉండి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. నగ్మా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

Read Entire Article