షాకింగ్ : తెలంగాణలో ఒకే రోజు రెండు వేలు దాటిన కరోనా కేసులు..

2 days ago 4

Apr 8, 2021 10:21 AM

 తెలంగాణలో ఒకే రోజు రెండు వేలు దాటిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వేయిలోపే నమోదవుతున్న కేసులు ఇవాళ 2వేలు దాటాయి.   తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2055 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,704 కి చేరింది.  ఇందులో 3,03,601 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,362 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏడుగురు కరోనాతో మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1741కి చేరింది.  కరోనా బులెటిన్ ప్రకారం నిన్నటి రోజున 303 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

Read Entire Article