హాస్పిటల్ నుండి సచిన్ టెండూల్కర్ డిశ్చార్జ్...

2 days ago 6

Apr 8, 2021 07:32 PM

హాస్పిటల్ నుండి సచిన్ టెండూల్కర్ డిశ్చార్జ్...

మన దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. ఇప్పటికే ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రీటీలకు కరోనా సోకింది. అటు క్రికెటర్లపై కరోనా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవలే కరోనా బారిన పడ్డి ఆస్పత్రిలో చేరిన సచిన్‌ టెండూల్కర్‌ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నట్లు చెప్పిన సచిన్‌ ఇప్పుడు పూర్తిగా కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్తున్నారు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండనున్నారు సచిన్.

Read Entire Article