| Published: Thursday, April 8, 2021, 10:08 [IST]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అఖిరా నందన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. PSPK trends, ఇతర పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ కుర్రాడి గురించి చేస్తున్న హంగామా మాటల్లో చెప్పలేం. త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న అఖిరా నందన్ ఏప్రిల్ 8వ తేదీన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు అఖిరా బర్త్ డేను టాప్ ట్రెండింగ్ మార్చారు.
అఖిరా నందన్‌కు నిర్మాత బండ్ల గణేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే లిటిల్ పవర్ స్టార్ అంటూ విషెస్ తెలియజేశారు. నిన్ను భగవంతుడు చల్లగా చూడాలని కోరుకొంటున్నాను అని తన ట్వీట్లో పేర్కొన్నారు.

ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా అఖిరా నందన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున్న తెలియజేస్తున్నారు. దాంతో ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్‌గా మారారు.
అఖిరా నందన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. మీ నాన్న లాగే నీవు కూడా హర్డ్ వర్క్ చేసి.. భవిష్యత్‌లో పవర్ స్టార్ గర్వించేలా హీరో కావాలి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
అఖిరా కెరీర్ గురించి ఇటీవల తల్లి రేణు దేశాయ్ మాట్లాడుతూ.. చిరంజీవి మెగాస్టార్.. ఆయన అఖిరాకు పెదనాన్న, పవన్ కల్యాణ్ స్టార్ హీరో, రాజకీయ నేత.. అఖిరాకు తండ్రి.. అలాగే రాంచరణ్ పెద్ద హీరో.. రాంచరణ్‌కు అఖిరాకు అన్నయ్య.. మెగా అనేది నా కుమారుడి రక్తంలోనే ఉంది. మెగా ఫ్యామిలీ ట్యాగ్ ఉండటంలో తప్పేమి లేదు అంటూ స్పష్టం చేశారు.
English summary
Pawan Kalyan's son Akira Nandan celebrating his Birthday on April 8th. Along with Bandla Ganesh, Many Fans of Power Star are wishing the Jr. Pawan Kalyan. Bandla Ganesh Wishes Happy birthday to our little powerstar god bless you Akira 💐🙌🏻🎂
Story first published: Thursday, April 8, 2021, 10:08 [IST]
X
Receive FREE Movie News & Gupshup
In Your Inbox