Breaking: జవాన్ రాకేష్ సింగ్ విడుదల.! వదిలేసిన మావోలు

2 days ago 3

| Samayam Telugu | Updated: 08 Apr 2021, 04:34:00 PM

ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల దాడి ఘటనలో సంచలనం చోటుచేసుకుంది. మావోలు బందీగా తీసుకెళ్లిన రాకేష్ సింగ్‌ను విడుదల చేసినట్లు సమాచారం. ఆయన్ను అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్లినట్లు తెలిసింది.

రాకేశ్వర్ సింగ్(మావోయిస్టులు విడుదల చేసిన ఫొటో)

ప్రధానాంశాలు:

  • మావోయిస్టుల చెరలో బందీగా రాకేశ్వర్ సింగ్
  • కొద్దిసేపటి క్రితమే విడుదల
  • తెర్రం అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు సమాచారం
ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు దాడిలో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మావోల చెరలో బంధీగా ఉన్న రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు కొద్దిసేపటి కిందట వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. తెర్రం అటవీ ప్రాంతంలో రాకేష్ సింగ్‌ని మావోయిస్టులు వదిలిపెట్టారని.. మరికొద్దిసేపట్లో ఆయన బెటాలియన్‌కు చేరుకుంటారని సమాచారం. ఈ నెల 3న జరిగిన మావోయిస్టుల దాడి అనంతరం కొందరు జవాన్లు కనిపించకుండా పోయారు. వారిలో రాకేష్ సింగ్‌ని బందీగా తీసుకెళ్లినట్లు మావోయిస్టులు జర్నలిస్టుల ద్వారా సమాచారం అందించారు.

అప్పటి నుంచి రాకేష్ సింగ్‌ను ప్రాణాలతో వదిలిపెట్టాలని విజ్ఞప్తులు వచ్చాయి. మా నాన్నని వదిలిపెట్టాలంటూ రాకేష్ సింగ్ కూతురు ఏడుస్తూ కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి రోదన పలువురిని కంటతడి పెట్టించింది. అయితే ప్రభుత్వం చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే రాకేష్‌ సింగ్‌ని వదిలేస్తామని మావోయిస్టులు చెప్పారు. అయినప్పటికీ బేషరతుగా రాకేష్ సింగ్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి కిందట తెర్రం అడవుల్లో రాకేష్‌ని వదిలిపెట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: జీతాలు తీసుకునే వారు అమరవీరులా.! చిచ్చురాజేసిన ‘ఆమె’ఫేస్‌బుక్‌ పోస్ట్

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్ పేజీను లైక్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : chhattisgarh attack: maoists releases jawan rakeshwar singh
Telugu News from Samayam Telugu, TIL Network

Read Entire Article